Posted in

Puttu Bhogulamu Memu in Telugu

Annamacharya

॥ Puttu Bhogulamu Memu Telugu Lyrics ॥

పుట్టుభోగులము మేము భువి హరిదాసులము ।
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥

పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు ।
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥

గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు ॥
భామిని యాకె మగని ప్రాణధారి లెంక-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥

పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు ।
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Puttu Bhogulamu Memu Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *