॥ Paluku Tenela Talli Telugu Lyrics ॥
పలుకు దేనెల తల్లి పవళించెను ।
కలికి తనముల విభుని గలసినది గాన ॥
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను ।
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను ।
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన ॥
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను ।
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన ॥
– Chant Stotra in other Languages –
Annamacharya Keerthanalu » Paluku Tenela Talli Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil
