Posted in

Nelamoodu Sobhanaalu in Telugu

Annamacharya

॥ Nela Moodu Shobanalu Telugu Lyrics ॥

నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు ।
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ॥

రామనామమతనిది రామవు నీవైతేను ।
చామన వర్ణమతడు చామవు నీవు ।
వామనుడందురతని వామనయనవు నీవు ।
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ॥

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు ।
కరిగాచెదాను నీవు కరియానవు ।
సరి జలధిశాయి జలధికన్యవు నీవు ।
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ॥

జలజ నాభుడతడు జలజముఖివి నీవు ।
అలమేలుమంగవు నిన్నెలమెదాను ।
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె ।
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Nelamoodu Sobhanaalu Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *