Posted in

Muddugare Yashoda in Telugu

Saint Thyagaraja

॥ Muddugare Yashoda Telugu Lyrics ॥

॥ ముద్దుగారే ॥
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ।
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము ।
పంతమాడే కంసుని పాలి వజ్రము ।
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస ।
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ॥

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము ।
మితి గోవర్ధనపు గోమేధికము ।
సతమై శంఖు చక్రాల సందుల వైఢూర్యము ।
గతియై మమ్ముగాచే(టి) కమలాక్షుడు ॥

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ।
ఏలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము ।
పాలజలనిధిలోని పాయని దివ్య రత్నము ।
బాలుని వలె తిరిగే పద్మనాభుడు ॥

– Chant Stotra in other Languages –

Sri Thyagaraja Keerthana » Muddugare Yashoda Lyrics in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *