Posted in

Manujudai Putti in Telugu

Annamacharya

॥ Manujudai Putti Telugu Lyrics ॥

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ॥

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి ।
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ॥

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై ।
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Manujudai Putti Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *