Posted in

Emoko Chigurutadharamuna in Telugu

Annamacharya

॥ Emoko Chigurutadharamuna Telugu Lyrics ॥

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను ।
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ॥

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన ।
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు ।
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు ।
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ॥

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల ।
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు ।
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు ।
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ॥

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల ।
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు ।
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల ।
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Emoko Chigurutadharamuna Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *