Posted in

Cheri Yasodaku in Telugu

Annamacharya

8॥ Cheri Yasodaku Telugu Lyrics ॥

చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ॥

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు ।
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు ॥

మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి ।
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ॥

ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు ।
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Cheri Yasodaku Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *