Posted in

Chakkani Talliki in Telugu

Annamacharya

॥ Chakkani Talliki Telugu Lyrics ॥

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా ॥

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా ।
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా ॥

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా ।
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ॥

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా ।
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Chakkani Talliki Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *