Posted in

Raamudu Lokaabhiraamudu in Telugu

Annamacharya

॥ Raamudu Lokaabhiraamudu Telugu Lyrics ॥

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే ॥

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే ।
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే ॥

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే ।
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే ॥

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే ।
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Raamudu Lokaabhiraamudu Lyrics in Hindi » English » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *