Posted in

Phaala Netraanala in Telugu

Annamacharya

॥ Phala Netranala Telugu Lyrics ॥

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ॥

ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార
లలిత నిశ్వాసడోలా రచనయా ।
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన-
చలన విధినిపుణ నిశ్చల నారసింహా ॥

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-
లవదివ్య పరుష లాలాఘటనయా ।
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ
నవనవప్రియ గుణార్ణవ నారసింహా ॥

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి-
కార స్ఫులింగ సంగక్రీడయా ।
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ-
కారణ ప్రకట వేంకట నారసింహా ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Phaala Netraanala Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *