Posted in

Nimushamedategaka in Telugu

Annamacharya

॥ Nimushamedategaka Telugu Lyrics ॥

నిముషమెడతెగక హరి నిన్ను తలచి ।
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥

నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి ।
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ॥

కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి ।
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥

ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను ।
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Nimushamedategaka Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *