Posted in

Meloko Srungaararaaya in Telugu

Annamacharya

॥ Meloko Srungaararaaya Telugu Lyrics ॥

మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల ।
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥

సందడిచే గోపికల జవ్వనవనములోన ।
కందువందిరిగే మదగజమవు ।
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని ।
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ॥

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో ।
రతిముద్దు గురిసేటి రాచిలుకా ।
సతుల పదారువేల జంట కన్నుల గలువల- ।
కితమై పొడిమిన నా యిందు బింబమ ॥

వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై ।
నిరతి వాలిన నా నీలమేఘమా ।
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద ।
గరిమ వరాలిచ్చే కల్పతరువా ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Meloko Srungaararaaya Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *