Posted in

Kulukuga Nadavaro in Telugu

Annamacharya

॥ Kulukuga Nadavaro Telugu Lyrics ॥

కులుకక నడవరో కొమ్మలాలా ।
జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా ।
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ॥

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల ।
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ॥

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో ।
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Kulukuga Nadavaro Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *