Posted in

Kolichina Vaarala in Telugu

Annamacharya

॥ Kolichina Vaarala Telugu Lyrics ॥

కొలిచిన వారల కొంగుపైడితడు ।
బలిమి తారక బ్రహ్మమీతడు ॥

ఇనవంశాంబుధి నెగసిన తేజము ।
ఘనయఙ్ఞంబుల గల ఫలము ।
మనుజరూపమున మనియెడి బ్రహ్మము ।
నినువుల రఘుకుల నిధానమీతడు ॥

పరమాన్నములోపలి సారపుజవి ।
పరగినదివిజుల భయహరము ।
మరిగినసీతా మంగళసూత్రము ।
ధరలో రామావతారంబితడు ॥

చకితదానవుల సంహారచక్రము ।
సకల వనచరుల జయకరము ।
వికసితమగు శ్రీవేంకట నిలయము ।
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Kolichina Vaarala Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *