॥ Jaya Jaya Raama Telugu Lyrics ॥
జయ జయ రామా సమరవిజయ రామా ।
భయహర నిజభక్తపారీణ రామా ॥
జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా ।
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా ॥
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా ।
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా ॥
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా ।
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా ॥
– Chant Stotra in other Languages –
Annamacharya Keerthanalu » Jaya Jaya Raamaa Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil
