Posted in

Chaaladaa Brahmamidi in Telugu

Annamacharya

॥ Chaaladaa Brahmamidi Telugu Lyrics ॥

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు ।
జాలెల్ల నడగించు సంకీర్తనమ్ ॥

సంతోష కరమైన సంకీర్తనమ్ ।
సంతాప మణగించు సంకీర్తనమ్ ।
జంతువుల రక్షించు సంకీర్తనమ్ ।
సంతతము దలచుడీ సంకీర్తనమ్ ॥

సామజము గాంచినది సంకీర్తనమ్ ।
సామమున కెక్కుడీ సంకీర్తనమ్ ।
సామీప్య మిందరికి సంకీర్తనమ్ ।
సామాన్యమా విష్ణు సంకీర్తనమ్ ॥

జముబారి విడిపించు సంకీర్తనమ్ ।
సమ బుద్ధి వొడమించు సంకీర్తనమ్ ।
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనమ్ ।
శమదమాదుల జేయు సంకీర్తనమ్ ॥

జలజాసనుని నోరి సంకీర్తనమ్ ।
చలిగొండ సుతదలచు సంకీర్తనమ్ ।
చలువ గడు నాలుకకు సంకీర్తనమ్ ।
చలపట్టి తలచుడీ సంకీర్తనమ్ ॥

సరవి సంపదలిచ్చు సంకీర్తనమ్ ।
సరిలేని దిదియపో సంకీర్తనమ్ ।
సరుస వేంకట విభుని సంకీర్తనమ్ ।
సరుగనను దలచుడీ సంకీర్తనమ్ ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Chaaladaa Brahmamidi Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *