Posted in

Tiruveedhula Merasi in Telugu

Annamacharya

॥ Tiruveedhula Merasee Deva Telugu Lyrics ॥

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ॥

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద ।
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ॥

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ॥
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు ॥

కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట ।
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Tiruveedhula Merasi Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *