Posted in

Antaryami Alasiti in Telugu

Annamacharya

॥ Antaryami Alasiti Telugu Lyrics ॥

అంతర్యామి అలసితి సొలసితి ।
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥

కోరిన కోర్కులు కోయని కట్లు ।
తీరవు నీవవి తెంచక ।
భారపు బగ్గాలు పాప పుణ్యములు ।
నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥

జనుల సంగముల జక్క రోగములు ।
విను విడువవు నీవు విడిపించక ।
వినయపు దైన్యము విడువని కర్మము ।
చనదది నీవిటు శాంతపరచక ॥

మదిలో చింతలు మైలలు మణుగులు ।
వదలవు నీవవి వద్దనక ।
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె ।
అదన గాచితివి అట్టిట్టనక ॥

– Chant Stotra in other Languages –

Annamacharya Keerthanalu » Antaryami Alasiti Lyrics in Hindi » English » Bengali » Kannada » Malayalam » Tamil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *